:

1 Timothy 3

1

ఎవడైను అధ్యక్షపదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.

2

"అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్నీపురుషుడును, మితానుభవుడును,"

3

"స్వస్థబుద్ధికలవాడును, మర్యాదస్థుడును, అతిథిప్రియుడును, బోధింపతగినవాడునై యుండి మద్యపానియు కొట్టువాడును గాక, సాత్వికుడును, జగమాడని వాడును ధనాపేక్షలేనివాడునై,"

4

సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీన పరచుకొనుచు తన యింటి వారిని బాగుగా ఏలు వాడునైయుండవలెను.

5

ఎవడైను తన యింటి వారిని ఏల నేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?

6

అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు.

7

మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపలి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై యుండవలెను.

8

"ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును మిగుల మద్య పానాసక్తులును దుర్లాభము నపేక్షించువారునై యుండక,"

9

విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను.

10

మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును.

11

అటువలె పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలోను నమ్మకమైన వారునై యుండవలెను.

12

"పరిచారకులు ఏక పత్నీవ్రతులై, తమ పిల్లలను తమ ఇంటివారిని బాగుగా ఏలువారునై ఉండవలెను."

13

పరిచారకులై యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసు నందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు.

14

శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను;

15

అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది.

16

"నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోక మందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యెను."

Link: